//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలీవుడ్ లో ఐఫోన్ x క్రేజ్

Category : editorial

యాపిల్ ఐఫోన్‌ను ఇష్టపడనివారు ఎవరుంటారు..? ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్న వ్యక్తి నేను 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న ఫోన్ వాడుతున్నాను అని అనగానే .. నేను ఐఫోన్ వాడుతున్నాను అని ఎదుటి వ్యక్తి అనగానే మారు మాట్లాడడు. అంత గొప్ప గుర్తింపు ఉంది ఈ అమెరికన్ ఫోన్‌కి. మన చేతిలో లేటెస్ట్ ఐఫోన్ ఉందంటే చాలు.. మనకి అదొక బ్రాండ్. సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బడా బాబుల పిల్లలు, గాడ్జెట్స్ అంటే మోజుపడేవారు, ఇంకా యాపిల్ ప్రేమికులు.. వీళ్లే ఐఫోన్ అంటే పడిచస్తారని అనుకుంటాం. కానీ లేటెస్ట్‌గా వచ్చిన యాపిల్ ఐఫోన్ టెన్ స్మార్ట్‌ఫోన్ అంటే బాలీవుడ్ తారలు కూడా పడిచస్తున్నారు.
అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, కరణ్ జోహార్, సోహా అలీ ఖాన్, కృతి సనన్ చేసిన ట్వీట్లే దీనికి నిదర్శనం. తాము కొత్త ఐఫోన్ టెన్‌ను చేజిక్కుంచుకున్నామని వారంతా ట్వీట్లు చేశారు.

ఐఫోన్ టెన్‌ను కొనుగోలు చేసినందుకు వారు ఎంతో ఆనందాన్ని ట్వీట్లలో వ్యక్తపరిచారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లపై విపరీతమైన పిచ్చి ఉండే యువత తమకిష్టమైన మొబైల్‌ను దక్కించుకోగానే హుర్రే అంటూ గెంతులేస్తారు. ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అలాగే చేస్తున్నట్టున్నారు. కానీ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఐఫోన్ టెన్‌ను కొనుగోలు చేయడం మాటలు కాదు. ఎందుకంటే దీని ధర అక్షరాల లక్ష రూపాయలు. సెలబ్రిటీలను లక్ష రూపాయలు పెద్ద లెక్క కాదు కాబట్టి ఎన్ని ఐఫోన్ టెన్‌లైనా కొనుగోలు చేస్తారు. మధ్య తరగతి వ్యక్తి స్టోర్లలో చూసి ఆనందపడటమే.  అయితే ఈ ఐ ఫోన్ x ఫీచర్స్ విషానికి వస్తే 5.8 అంగుళాల టచ్ స్క్రీన్, 4K వీడియో రికార్డింగ్ , 12 మెగా పిక్సెల్ కెమెరా , తో పాటు అనేక కొత్త కొత్త హంగులతో మార్కెట్ లో కి విడుదల అయింది. మరి మన బాలీవుడ్ తారల ట్వీట్ల ను మీరూ ఓ లుక్కేయండి.