సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తాజాగా జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2017లో ఐఓఎస్ 11 గురించిన విశేషాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రానున్న సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ 11 అప్డేట్ అందుకోనున్న డివైస్ల లిస్ట్‌ను యాపిల్ ప్రకటించింది. ఈ డివైస్‌లకు సెప్టెంబర్‌లో ఐఓఎస్ 11 అందుబాటులోకి వస్తుంది.
ఐఫోన్ 7, 7 ప్లస్, 6ఎస్, 6ఎస్ ప్లస్, 6, 6 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, 5ఎస్, 12.9 ఇంచుల ఐప్యాడ్ ప్రొ 2వ జనరేషన్, మొదటి జనరేషన్, 10.5 ఇంచుల ఐప్యాడ్ ప్రొ, 9.7 ఇంచుల ఐప్యాడ్ ప్రొ, ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ 5వ జనరేషన్, ఐప్యాడ్ మినీ 4, మినీ 3, మినీ 2, ఐపాడ్ 6వ జనరేషన్ డివైస్‌లు ఐఓఎస్ 11 అప్డేట్ను పొందనున్నాయి. ఈ డివైస్‌లు కలిగిన వారికి సెప్టెంబర్ నెలలో కొత్త ఓఎస్ అందుబాటులోకి రానుంది.