//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంటర్‌నెట్ వేగం పెంపు

Category : national

దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్ వేగం 512 కేబీపీఎస్ ల నుంచి రెండు ఎంబీపీఎస్ (మెగాబిట్స్‌ పర్‌ సెకన్‌) ల వరకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, స్మార్ట్ సిటీలు, డిజిటల్ చెల్లింపుల కోసం ఇంటర్‌నెట్ కనీస బాడ్ర్‌ బ్యాండ్‌ స్పీడును పెంచునున్నట్లు అరుణా పేర్కొన్నారు. వీడియోలు డౌన్ లోడ్ తోపాటు మొబైల్ వినియోగదారులకు 4 జి, 5 జి సేవలు అందేలా చూస్తామని ఆమె చెప్పారు. కేంద్రం నిర్ణయంతో ఇంటర్‌నెట్ వేగం నాలుగింతలు పెరిగే అవకాశముంది. దీంతో ఇక నెటిజన్లకు బ్రౌజింగ్ మరింత సులభం కానుంది. ప్రపంచమంతా ‘స్మార్ట్‌’ మయం అవుతున్న నేపథ్యంలో 2జీ, 3జీ రోజులు పోయి ఇప్పుడు 4జీ, 5 జీ రోజులు వచ్చేశాయి, మనదేశంలో ఇంకా ఇంటర్నెట్‌ సగటు వేగం 512 కేబీపీఎస్ గానే (కిలో బిట్స్‌ పర్‌ సెకన్‌) ఉంది. ఈ నేపథ్యంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్నెట్‌ వేగాన్ని అందుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 

Related News