భారత దేశపు ఆఫ్ స్పిన్నర్ క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ ప్రతిష్టాకరమైన ఇంటర్నేషనల్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు నేడు అందుకున్నారు. 2017కు సీట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డును మాజీ భారత్ స్కిప్పర్ సునీల్ గవాస్కర్, ఆర్జిపి గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ల నుండి భారత్ క్రికెట్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు.
అశ్విన్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్,బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా లపై ఆడిన 13 టెస్ట్ మ్యాచ్ లలో 10 మ్యాచ్ లను భారత్ గెలుచుకొంది. గత 12 నెలల్లో 99 వికెట్ లను తీసుకున్నారు.
యువ బ్యాట్స్ మెన్ శుభమాన్ గిల్ `యంగ్ ప్లేయర్ అఫ్ ది ఇయర్' అవార్డు' ను గెలుచుకున్నారు. భారత్ - ఇంగ్లాండ్ ల మధ్య ముంబై లో జరిగిన యు-19 ఒకరోజు సిరీస్ లో ప్రదర్శించిన అద్భుత ఆటతీరుకు ఈ అవార్డు ఇచ్చారు.