//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరకులో హాట్ బెలూన్ ఫెస్టివల్.. విహంగ వీక్షణంతో పర్యాటకుల సంబరం

Category : history editorial

విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అరకు కు ప్రత్యేక అందాన్ని తెచ్చిపెట్టింది. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే...అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది. బెలూన్లను ఎగురవేసేందుకు 13 దేశాల బృందాలు అరకు వచ్చి సందడి చేస్తున్నాయి. జనవరీ 18 నుంచి 20 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పటికే అరకు అందాల హరివిల్లుగా మారింది. పర్యాటకంగా అరకులోయకు మరింత గుర్తింపు తెచ్చే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను నిర్వహిస్తోంది. చల్లని వాతావరణంలో గడిపేందుకు అరకు వస్తున్న పర్యాటకులకు ఈ హాట్ బెలూన్లు కనువిందు చేస్తున్నాయి .

ఈ బెలూన్లు సముద్ర మట్టానికి 50వేల అడుగుల ఎత్తు వరకూ ఎగురుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. 2017లో జరిగిన హాట్ బెలూన్ ఫెస్టివలలో భారత్ తో పాటు థాయ్ లాండ్, టర్కీ, ప్రాన్స్, న్యూజిలాండ్ వంటి 13 దేశాలకు చెందిన 16 బెలూన్లు గాలిలో చక్కెర్లు కొడుతూ పొటీ పడ్డాయి. ఈసారి మరింత గొప్పగా ఈ పండగను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది 23 దేశాలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నాయి.హాట్ బెలూన్లు గాల్లో చక్కర్లు కొడుతూ అరకుకు మరింత శోభను తెచ్చాయి .

విశాఖ మన్యం హరివిల్లును తలపిస్తోంది. పచ్చని వాతావరణం కొండ కోనల మధ్య రంగురంగుల బెలూన్లు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. అందమైన బుడగులతో అరకు మరింత అందంగా కనిపిస్తోంది. ఇక పర్యాటకులకైతే విశాఖ మన్యం సరికొత్త అనుభూతిని పంచుతోంది. విశాఖ మన్యం హరివిల్లును తలపిస్తోంది. పచ్చని వాతావరణం కొండ కోనల మధ్య రంగురంగుల బెలూన్లు కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. విశాఖ అరకు లోయలో ప్రతి ఏటా నిర్వహించే హాట్ బెలూన్ ఫెస్టివల్‌ను పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దాదాపు 26 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు బెలూన్ గ్లైడర్స్ తమ బ్రాండింగ్ ను ప్రదర్శిస్తున్నారు. ఈసారి కార్న్ ఫ్లా, జోకర్, ఎగ్, స్ట్రాబెర్రీ, నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు సాధారణ బెలూన్లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు విభాగాల్లో బెలూన్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

10మంది కెపాసిటీ, అలాగే ఆరుగురు సామర్ధ్యమున్న బెలూన్లలో పర్యాటకులు ఆకాశ పర్యటన చేస్తున్నారు. సుమారు గంటపాటు మన్యం అందాలను ఆకాశం నుంచి వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు. అనుకూలమైన వాతావరణంతోపాటు సంక్రాంతి మరియు వారాంతపు సెలవులు కలిసి రావడంతో ఈసారి హాట్ బెలూన్ ఫెస్టివల్‌‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పర్యాటకులతో అరకు సందడిగా మారింది.