//single page style gallary page

Interesting Facts About CM Jagan

Category : politics state

Click here to read this article in Telugu

ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ ఎబౌట్ సీఎం జగన్..!

యెదుగూరి సందింటి జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా ఉన్నారు. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుమారుడు. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి డిసెంబ‌ర్ 21, 1972 లో క‌డ‌ప జిల్లాలోని పులివెందులలో జ‌న్మించారు. ఆయ‌న త‌న పాఠ‌శాల విద్య‌ను హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ నుంచి, నిజామ్ క‌ళాశాల నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.

జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బి.కామ్ డిగ్రీతో పాటు, ఎంబీఏ చ‌దివారు. ఆగ‌స్టు 28, 1996 నాడు జ‌గన్ మోహ‌న్ రెడ్డి వివాహం భార‌తితో జ‌రిగింది. ఆమె తండ్రి పులివెందుల స్థానిక పిల్ల‌ల వైద్యులు, దాత అయిన డా.ఈ.సీ. గంగిరెడ్డి. జ‌గ‌న్, భార‌తీ కి ఇద్ద‌రు కూతుళ్లు.

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తల్లి, వై.యస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు.

రాజీనామా ఫలితంగా 2011 మే లో జరిగిన ఉపఎన్నికలలో మరల కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో గెలుపొందారు.

2009

భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున క‌డ‌ప పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.

2010

15 వ లోక్‌స‌భ‌లో త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

2011

ఉప ఎన్నిక‌ల్లో గెలిచి, జూన్ 13న ఆయ‌న తిరిగి 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

2011

ఫిబ్ర‌వ‌రి 16, 2011 న ఆయ‌న యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు.

2014

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు.

2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం (1.25) తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 5 సంవత్సరాలు

తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పిస్తు వచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017-11-16 లో ఇడుపలపాయ నుండి 2019-01-09 లో ఇచ్ఛాపురం వరకు 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలొమీటర్లు పాదయాత్ర చెసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యారు

2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసన సభ్యుడు. సుమారు 90000 పైగా మెజార్టీతో గెలవడం ఆయన పట్ల ప్రజలకి ఉన్న విశ్వాశానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన గొప్ప నైజమ్ ప్రజలలో ఆయనకి అంతటి ప్రాముఖ్యతని పేరుని తెచ్చిపెట్టాయి అనడంలో సందేహం లేదు.

Yeduguri Sandanti Jagan Mohan Reddy is a prominent political leader. YSR Congress chief of the Andhra Pradesh Legislative Assembly. He is the son of former Andhra Pradesh Chief Minister YS Rajasekhara Reddy. Jaganmohan Reddy was born on December 21, 1972 at Pulivendu in Kadapa district. He completed his schooling from the Hyderabad Public School and the Nizam College.

Jaganmohan Reddy is an MBA student with a B.Com degree . On August 28, 1996, Jagan Mohan Reddy's marriage to Bharti was completed. Her father was a local pediatrician and donor, Dr. E.C. Gangireddi. Jagan and Bharti have two daughters.

Late Andhra Pradesh Chief Minister YS. Rajasekhara Reddy disagreed with the Congress party on September 9, 2009 when he heard of the sudden death and refused to take the comfort of the families of the dead, resigned from the Lok Sabha membership and left the party. On March 11, 2011, the YSR Congress Party was formed. His mother, YS Vijayamma was the honorary president of this party.

Kadapa Lok Sabha elections held in May 2011, again as a result of the resignation of a member of the 5.45 lakh majority won.

2009

He was elected as a Member of Parliament of the Indian National Congress .

2010

He resigned as MP for the 15th Lok Sabha .

2011

He won the by-election and was re- elected to the 15th Lok Sabha on June 13.

2011

On February 16, 2011, the Youth Workers Farmers Congress (YSR Congress) was formed.

2014

Jagan Mohan Reddy elected as MLA

In the 2014 general election, his political rival Nara Chandrababu Naidu, who was defeated by the Telugu Desam Party at the presidency, lost the lowest vote share (1.25) and entered the assembly as an opposition leader.

5 years old, strongly disagreeing with things like not giving special status

He fought the Telugu Desam government and educated people on special status. In the name of a public effort to explain the failures of the government to the people and to get a closer look, the people of the state crossed 3,648 kilometers in 125 constituencies in the 13 districts of the state from Idupalapaya in 2017-11-16 to Ichchapuram in 2019-01-09.

In the 2019 Andhra Pradesh Legislative Assembly elections, the YSR Congress won 151 seats and the Andhra Pradesh Chief Minister won 151 seats. He is also the largest legislator in Andhra Pradesh in the 2019 general election. Winning over 90000 is a testament to the people's confidence in him. There is no doubt that his great Nizam's popularity has made him one of the most important of all.