Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్‌పై వరల్డ్ బ్యాంక్ సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు

Posted 3 months ago | Category : national

భారత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. సంపూర్ణమైన నిబద్ధతతో తమ మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధి ప్రపంచ అభివద్ధికి దోహదపడుతుందన్నారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో భారత్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 100 స్థానానికి చేరుకున్నట్టు ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాంటి పురోగతి చాలా అరుదైన విషయమనీ... ప్రత్యేకించి భారత జనాభా సంఖ్య పరంగా చూసినా ఇదే విషయం తెలుస్తుందని జార్జివా వ్యాఖ్యానించారు. 'భారత వ్యాపార సంస్కరణలు' అంశంపై శనివారం ప్రవాసి భారతీయ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ...

''భారత దేశం అన్ని విషయాల్లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఇలాంటి పురోగతి చాలా అరుదు. ప్రత్యేకించి అత్యధిక జనాభాగల భారత్ విషయంలో మరింత ఆసక్తికరమైన విషయం. సరళమైన విధానాలు, అధికారిక బంధనాలు సడలించడం, టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవడం, చివరి వినియోగదారుడి నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటి చర్యల వల్లే ఈ విజయం సాధ్యమైంది. సంస్కరణల ద్వారా స్థిరమైన ఫలాలు వస్తాయి. ప్రస్తుతం భారత్ సాధించిన ఈ విజయం నిజంగా అద్భుతం. ఇదే ఉత్సాహంతో ముందు ముందు మరిన్ని సంస్కరణలు చేపట్టాలి...'' అని పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పైనా ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఏకీకృత అంతర్గత మార్కెట్ వ్యవస్థ (సిస్టమ్ ఆఫ్ యూనిఫైడ్ ఇంటర్నల్ మార్కెట్) ద్వారా భారత్‌కు తిరుగులేని అభివృద్ధి అవకాశాలు లభించాయన్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే