//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Category : national politics

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో అవకాశాలు కొరవడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన 'నరేంద్ర మోదీ కార్యాలయంలో ఒక్క రైతునైనా మీరు ఎప్పుడైనా చూశారా? మోదీ ప్రభుత్వంలో రైతులకు గుర్తింపే లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. రుణాలు మాత్రం మాఫీ కాకుండా అలానే ఉంటున్నాయి' అని రాహుల్ ఆరోపించారు.

దేశ యువతలు అవకాశాలు కొరవడ్డాయని, కోకకోలా యజమాని అమెరికాలో 'షికాంజి' (నిమ్మరసం) అమ్ముతారు, మెక్డొనాల్డ్ ఓనర్ 'ధాబా' నడుపుతారు, ఫోర్డ్ మైటార్స్ వ్యవస్థాపకుడు ఒక మెకానిక్. ఒక మెకానిక్ ఇండియాలో ఆటోమొబైల్ కంపెనీ వ్యవస్థాపకుడు కావడం మీరు ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు, అదే విధంగా బిజెపిలో స్వేచ్చ లేదని ఎంపీలు సైతం మోడికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే భయపడుతున్నారని సంఘ్,బిజెపి దేశాన్ని విభజించాలని చూస్తున్నాయన్నారు.