అండర్–19 వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది ఫైనల్ లోకి అడుగు పెట్టింది కాగా ఈ మ్యాచ్ లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. మైదానంలో ఇరు దేశాల యువ ఆటగాళ్లు పరస్పరం సహకరించుకున్న తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది.
భారత బ్యాట్స్మన్ శుభ్మాన్ గిల్ సెంచరీకి చేరువైన సమయంలో అతడి షూ లేసు ఊడిపోవడంతో సహాయం కోసం తన సహచర ఆటగాడి వేపు చూస్తున్నాడు ఇంతలో విషయాన్నీ గమనించిన పాకిస్తాన్ ఫీల్డర్ షూ లేసు కట్టాడు. అలాగే తమ ప్రత్యర్థి బ్యాట్స్మన్ షూ లేసు ఊడిపోయినప్పుడు భారత ఫీల్డర్ సహాయం చేశాడు.
సెంచరీ పూర్తి చేసిన శుభ్మాన్ గిల్ దగ్గరకు వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లలో చాలా మంది అతడిని అభినందించారు. కీలక మ్యాచ్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరు జట్ల ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ వేసి ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ ఫలితం ఎలావున్న యువ ఆటగాళ్లు తమ ప్రవర్తనతో మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. భారత్-పాక్ క్రికెటర్లు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదంటూ కామెంట్లు పెట్టారు.