//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అపర భగీరధుడు, ఒంగోలు టైగర్ కరణం @ 40

Category : editorial

కరణం బలరాం ప్రత్యక్ష రాజాకీయాలోకి వచ్చి ఎమ్మెల్యే గా ఎన్నికయి 40 ఏళ్ళు అవుతున్న సందర్భంలో ఇదే మా INS స్పెషల్ స్టొరీ.

జనప్రియనేత, మహానేత, అపర భగీరధుడు, కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వని దాన కర్ణుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, శ్రేయోభిలాషి, నిరాడంబరుడు, కులమతాలకి అతీతంగా ఆశ్రితులకి అండగా నిలిచే వ్యక్తి అనే మాటలు కేవలం వీరిని మాత్రమే వర్ణించడానికా అన్నట్టు 31 అక్టోబరు 1946 న కరణం వెంకటేశ్వర్లు - అన్నపూర్ణమ్మ దంపతులకి జన్మించాడు ఆ కారణజన్ముడు, ఆయన ఎవరో కాదు ఒంగోలు పులి - ప్రకాశం దళపతి కరణం బలరామ కృష్ణ మూర్తి. ఆయన అభిమానులు అంతా ఆయన్ని ముద్దుగా బలరాం అని పిలుచుకుంటారు. నాటి ప్రధాని ఇందిరా బలరాం నా మూడవ కుమారుడు అని ప్రకటించారు అంటేనే అర్ధం అవుతోంది ఆయన గొప్పతనం.

వారి జీవిత పరిణామ క్రమంలోకి తొంగి చూస్తే అవి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో దేశం రగిలిపోయిన రోజులు. ఆ తర్వాత తన రాజకీయ అవసరాల కోసం ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఈ క్రమంలో 1977 మార్చిలో లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఎమర్జెన్సీతో వ్యతిరేకతను మూటగట్టుకున్న ఇందిరాగాంధీ...ఆ ఎన్నికల్లో వోటర్ల వ్యతిరేకతకి కొట్టుకుపోయారు. అయితే, ఊహించని విధంగా ఏపీలో మాత్రం 42 స్థానాలకు గాను 41 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జనతా పార్టీ ఒక్క స్థానంలో గెలిచింది.

ఆ సమయంలోనే ఒంగోలులో ఆమె పర్యటించారు ఈ క్రమంలో ఆమె మీద వ్యతిరేక వర్గం దాడి చేయబోయింది. అయితే ప్రాణాలని సైతం లెక్క చేయని బలరాం అడ్డువెళ్లి ఆమె మీద ఈగ కూడా వాలకుండా కాపాడారు. కేవలం ఈ ఒక్క ఘటనతో ఆయన దేశ వ్యాప్తంగా మీడియాలో విశేష ఆదరణ పొందారు. అయితే ఆచార్య ఎన్జీరంగా అనుచరునిగా ఆయనకీ రాజకీయ ఆసక్తి ఏర్పడినా ఆయన మాత్రం ఇందిరా గాంధీ రెండవ కుమారుడు ప్రవేశపెట్టిన పంచతంత్రం పధకానికి ఆయన ఆకర్షితుడు అయి యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. క్రియాశీలక రాజకీయాలోకి వచ్చిన తొలినాళ్ళలోనే ఆయనకి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.

ఆ వెంటనే కొన్ని రోజులకి 1978 లో ఆయన జనాతా పార్టీ అభ్యర్ధి అయిన చెంచు గరాటయ్య మీద దాదాపు ఐదు వేల వోట్ల మెజారిటీతో శాసన సభ్యునిగా ఎన్నికవడం మొత్తం ఒక కలలా జరిగిపోయాయి. వీరు కాంగ్రెస్ కి చేస్తున్న విశేష కృషికి ఆయనకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి వరించింది. అయితే అనూహ్యంగా రాజకీయ పార్టీ ప్రకటించిన ఎన్టీఅర్ వైపు ప్రభావితుడు అయిన 1985 లో బలరాం ఆ పార్టీ లో జాయిన్ అయ్యారు.

ఈ విధంగా జాయిన్ అవడం ఆయన జీవితం లో ఓ ప్రత్యేక మైలురాయి అనడంలో అతిశయోక్తి కాదు. పార్టీలో మొత్తం జిల్లాకి తానే పెద్దగా వ్యవహరిస్తూ దేశానికే వెన్నుముకగా చెప్పబడే రైతు పక్షపాతిగా మారాడు, స్వతహాగా రైతు బిడ్డ అయిన బలరాం రైతుల అభ్యున్నతికి విశేష కృషి చేశారు.

నిరంతర సాగునీటి విడుదల,పంటకు మద్దతు ధర కోసం ఆయన ఎన్నికయిన నాటినుండి అవిశ్రాంతంగా పోరు సలుపుతునే ఉన్నారు. 1990 వ దశకంలో పొగాకు మార్కెట్ లో ఏర్పడిన తీవ్ర సంక్షోభం పొగాకు గిట్టుబాటు ధరని అమాంతం పడవేయగా రైతు పక్షాన నిలిచి తాను అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాడారు శ్రీ బలరాం. 1991లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అవిశ్రాంత పోరు సలిపారు.

అలాగే 1999 లో ఒంగోలు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయిన బలరాం 2000 సంవత్సరంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నియమితులయి తన సేవలు అందించారు. అలాగే 1999-2000 లోకసభలో సమాచార కమిటీ సభ్యుడిగా కుడా తన సేవలు అందించారు.

2004 లో అద్దంకి నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన తన 40 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎంపిగా తన సేవలు అందించారు. మోకాళ్ళ లోతు బురద నీటిలో వాహనాలు వెళ్ళే సంగతి దేవుడెరుగు మనం నడవగలిగితే చాలు అనుకునే ఆరోజుల్లో ప్రజల కష్టాలు తీరాలంటే ప్రతి వీధిలోను అప్రోచ్ రోడ్ లు ఉండాలని భావించిన అభినవ ఇంజినీర్ కరణం బలరాం.

మోడల్ విలేజ్ అనే పేరు వాడుకలోకి రాక ముంచే ఆయన పుట్టిన తిమ్మ సముద్రం అనే గ్రామాన్ని ప్రత్యేకంగా అభ్వృద్ధి చేసి ప్రతి రోడ్డుని ఆధునీకరించి, అద్భుత హంగులతో ఒక మోడల్ విలేజ్ గా నిలబెట్టిన ఘనత ఆయనది. అలా పుట్టిన సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న కొద్ది మండి ప్రముఖులలో ఆయన ముఖ్యుడు.

ఒకానొక దశలో జిల్లాకి 39 ప్రాజెక్ట్ లు మంజూరు అయితే అందులో 19 ప్రాజెక్ట్ లు కేవలం మార్టూరు సెగ్మెంట్ కి మంజూరు చేయడం ఆయన అసమాన కార్యదక్షతకి ఒక కోలామానం. ఆ ప్రాజెక్ట్ లే ఈరోజు మార్టూరు నియోజకవర్గ రైతన్నలకి మారుమూల పొలాలకి సైతం వర్షాధారం కాకుండా చేయడం ఈ ఒంగోలు అపర భగీరధుడి దీర్గ ద్రుష్టి కి తార్కాణం. ఆయన నిర్మింప చేసిన గుండ్లకమ్మ బ్రిడ్జ్ ఆయనకి సమాజం మీదున్న ప్రేమకి తార్కాణం.

బలరాం లేకుంటే గుండ్లకమ్మ. రామ తీర్ధం ప్రాజెక్ట్ లు అనేవి ఎప్పటికి నిర్మితమయ్యేవో చెప్పలేని పరిస్థితి. జిలా ప్రజలంతా ఒంగోలు టైగర్ అని పిలుచుకునే పులి లాంటి వ్యక్తి శ్రీ బలరాం. అభివృద్ధి చేయడంలో తమ నాయకుడు చంద్రబాబు తోనే పోటీ పడే నాయకుడు బలరాం.

ఇంత మంచి చేస్తూ వచినా ఆయనకి జిల్లాలో వ్యతిరేక వర్గం కూడా ఉంది అంటే దానికి కారణం కేవలం ఒకే ఒక కుటుంబం అదే గొట్టిపాటి కుటుంబం. ఈ రాజకీయం గురించి కొద్ది సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే దశాబ్దాలు గా కరణం , గొట్టిపాటి వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే మొదటి నుండి కూడా కరణం బలరాం కి అధినేత చంద్రబాబుతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి …కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం తో ఒకరు ఒక పార్టీ లో ఉంటే ఒకరు ఇంకో పార్టీలో ఉంటూ వచ్చారు.

మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మరణం తర్వాత ఆయన కుమారుడు నరసయ్యకి అప్పటి మార్టూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరికింది…ఈ క్రమం లో చంద్రబాబు తనకి సన్నిహితుడు అయిన కరణం బలరాం అప్పట్లో కాంగ్రెస్ లో ఉండగా ఆయన్ని పార్టీ లోకి ఆహ్వానించి గొట్టిపాటి – కరణం వర్గాల మధ్య సమన్వయం సాధించటం లో సఫలీకృతం అయ్యాడనే చెప్పాలి…ఈ దశ లో మార్టూరు అసెంబ్లీ స్థానానికి గొట్టిపాటి నరసయ్య , ఒంగోలు పార్లమెంట్ స్థానానికి బలరాం ని పంపించి ఒకరినొకరు బలపర్చుకునే విధంగా సమన్వయము తో ముందుకు నడిపించగలిగారు.

దశాబ్దాలు గా ఉన్న వర్గపోరు సమసిపోయింది అని రెండు వర్గాల వారు సంతొషిస్తున్న సమయంలో గొట్టిపాటి రవి (బుజ్జి ) రాజకీయ ఆరంగేట్రంతో మళ్ళీ వర్గపోరుకి బీజం పడింది …అప్పటికే మార్టూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన అన్న నరసయ్య మీదే కాలు దువ్వి…అతని మీదే పోటీ చేయటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తాను నమ్మిన తెలుగుదేశం పార్టీ సిద్దాంతాల మేరకు బలరాం మౌనం పాటిస్తూ, తన పని తానూ చేస్తూ, తన వర్గం మీదకి ఇప్పుడు తెదేపాలోనే చేరిన వారు దాడులు చేస్తుంటే తానూ హింస వైపు వెళ్ళకుండానే ఆయన తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

ఈ విధంగా చుసుకుంటే ఆయన్ని అపర చాణక్యుడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెలుగు దేశం తరపున ఎమ్మెల్సీ గా సేవలు అందిస్తున్నారు బలరాం. నాలుమర్లు ఎమ్మెల్యే గా, ఓ మారు ఎంపీగా సేవలు అందించిన బలరాంని మంత్రిగా చూసుకోవడానికి ఆయన అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. 2019 ఎన్నికలలో అఖండ మెజారిటీ సాధించి ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా ఎన్నికవ్వాలని వారు కోరుకుంటున్నారు.

కరణం బలరాం ప్రత్యక్ష రాజాకీయాలోకి వచ్చి ఎమ్మెల్యే గా ఎన్నికయి 40 ఏళ్ళు అవుతున్న సందర్భంలో ఇదే మా INS స్పెషల్ స్టొరీ.