//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూపాయి విలువ పెరిగితే ఐటీ కంపెనీల‌కు వణుకు

Category : world national business

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పేరు చెబుతేనే ఐటీ రంగం అత‌లాకుత‌లం అవుతోంది. తాజాగా ఐటీ రంగానికి మ‌రో పెద్ద ముప్పు వ‌చ్చిప‌డింది. మన రూపాయే మన ఐటీ కంపెనీలకు వణుకు పుట్టిస్తోంది. గత కొంత కాలంగా అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి మారక విలువ బలపడుతోంది. ఇప్పటి వరకు ఏకంగా 5.6 శాతం జంప్ అయింది. ఇదే ఇప్పుడు ఐటీ కంపెనీలకు దడ పుట్టిస్తోంది. మన ఐటీ కంపెనీల రెవెన్యూలో 90 శాతం అమెరికా నుంచే వస్తోంది. రూపాయి విలువ బలపడుతుండటంతో... ఈ కంపెనీల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ రాకేష్ థార్వే మాట్లాడుతూ, రూపాయి విలువ పెరగడం ఐటీ కంపెనీలకు ఆందోళనకరంగా మారిందని చెప్పారు. రూపాయి విలువ 1 శాతం పెరిగితే ఐటీ కంపెనీల మార్జిన్లు 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు తుడిచెపెట్టుకు పోతాయని తెలిపారు.