//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్టోబ‌ర్ చివ‌రి నాటికి టీడీపీలో చేర‌నున్న పారిశ్రామిక వేత్త‌లు వీరే..!

Category : politics

వేస‌వి కాలంలో రాక‌ముందే.. ఏపీలో వాతావ‌ర‌ణం సెగ‌లు క‌క్కుతుంది. ఇందుకు కార‌ణం, క్ష‌ణ‌.. క్ష‌ణానికి మారుతున్న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల వ్యూహాలే అన్న విషయం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రో ప‌క్క ప్ర‌ధాని మోడీ ఏపీకి తీర‌ని న‌ష్టం చేశార‌ని, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని నెర‌వేర్చ‌కుండా, ఏపీ ప్ర‌జ‌ల‌ను పుట్టెదు దు:ఖ‌ంలోకి నెట్టార‌ని అధికార పార్టీ టీడీపీ స‌హా మేధావులు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఇలా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ మిన‌హా ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌ధాని మోడీతోపాటు, బీజీపీని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతుంటే.. వైసీపీ మాత్రం ప్ర‌ధాని మోడీ పాలన చాలా గొప్ప‌గా ఉంద‌ని వంత పాడుతుంది.

అంతేకాకుండా, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ సైతం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా తీవ్ర న‌ష్టాన్ని చేకూర్చిన‌ బీజేపీకి, మోడీకి జై కొడుతూ ప్ర‌సంగాల‌ను ఇస్తున్నారు. జ‌గ‌న్‌ ప్ర‌సంగాల‌ను విన్న ప్ర‌జ‌లు కొంత మంది న‌వ్వుకోగా.. మ‌రికొంద‌రు ఏపీకి ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని పార్టీకి జ‌గ‌న్ జై కొట్ట‌డ‌మేంటి..? అంటూ వారిలో వారే ప్ర‌శ్నించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీకి, బీజేపీకి వంత పాడుతున్న వైసీపీకి ఓట్లు వేయ‌కూడ‌ద‌ని ప్ర‌జ‌లు నిశ్చ‌యించుకుంటున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు, అలాగే, ఇటీవ‌ల విడుద‌లైన స‌ర్వేలు సైతం త‌మ అంశాల్లో పేర్కొన్నాయి. బీజేపీపై, వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌తే త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తెస్తుంద‌ని, అంతేకాకుండా, చంద్ర‌బాబు సంక్షేమ ఫ‌లాలు అందుకు తోడ‌వుతాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇలా ప‌లు స‌ర్వేలు, రాజ‌కీయ విశ్లేష‌కులు అబిప్రాయాల‌ను దృష్టిలో ఉంచుకున్న పలు పార్టీల నేత‌లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు అనుగుణంగా, రాజ‌కీయ చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్నారు.అయితే, చంద్ర‌బాబుతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న వారిలో కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, స‌బ్బం హ‌రి, మాజీ మంత్రి డీఎల్ ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా, టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న కొణ‌తాల రామ‌కృష్ణ‌, స‌బ్బం హ‌రి ఇద్ద‌రు కూడా అన‌కాప‌ల్లి ఎంపీ సీటును ఆశిస్తున్నార‌ట‌. అయితే, వారిద్ద‌రిలో ఎవ‌రు ముందుగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. వారికే అన‌కాప‌ల్లి ఎంపీ సీటు కేటాయించేందుకు చంద్ర‌బాబు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని టీడీపీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. అలాగే, స‌బ్బం హ‌రి, మాజీ మంత్రి డీఎల్ టీడీపీలో చేరితే వారిని ఎక్క‌డ్నుంచి పోటీకి దించాలి..? అన్న అంశంపై సీఎం చంద్ర‌బాబు స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ట‌. ఇదండీ అస‌లు విష‌యం. ఇలా, ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు, నాయ‌కులు టీడీపీలో చేరేందుకు క్యూ క‌డుతుండ‌టంతో ప్ర‌తిప‌క్ష పార్టీల అగ్ర నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటూ టీడీపీ నేత‌లు సెటైర్లు వేస్తున్నారు.

Related News