//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరెస్ట్

Category : national

గతేడాది జకర్తాలో జరిగిన ఆత్మాహుతి దాడులకు సంబంధించి ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు భావిస్తున్న ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి యుస్రి యునుస్ వెల్లడించారు. ముగ్గురిని వేర్వేరు ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడులపై ఉగ్రవాదులను విచారిస్తున్నట్లు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 2016 జనవరిలో తూర్పు జకర్తాలోని బస్ టర్మినల్ వద్ద జరిపిన ఆత్మాహుతి దాడుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా..11 మందికి గాయాలైన విషయం తెలిసిందే.