Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉమెన్స్ డే స్పెషల్ ..యుద్ధ విమానాల్లో తెగువ చూపుతున్న మహిళా పైలట్ అవని కి సెల్యూట్

Category : world

స్త్రీ... ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడితే అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు. స్త్రీకి సమాజములో అంతటి ప్రాధాన్యత ఉంది. పురాణ కాలం నుండి నేటి వరకు నారీ శక్తికి ఎన్నో నిదర్శనాలున్నాయి. మహిళ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే .. అలాంటి మహిళలు ప్రస్తుత అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. యుద్ధరంగంలో ను కదం తొక్కుతున్నారు.

ఏకంగా యుద్ధవిమానాలను సైతం నడుపుతూ సరిలేరు మాకెవ్వరూ అని సగర్వంగా ముందుకు వెళుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భారత రక్షణ రంగంలో యుద్ధవిమానాల నడుపుతూ దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న మహిళా పైలట్ అవని చతుర్వేది పై INS MEDIA ప్రత్యేక కథనం.

అవని చతుర్వేది ... ఇండియాలో యుద్ద విమానాలు నడిపే మొదటి ముగ్గురు మహిళల్లో అవని చతుర్వేది ఒకరు. 2016లో విధుల్లో చేరిన అవని.. 2018లోనే 24 ఏళ్ల వయసులోనే యుద్ధ విమానాన్ని మిగ్ 21 బైసన్ విమానాన్ని 30 నిమిషాల పాటు నడిపి చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఈమెను పొగుడుతూ ఎంతోమంది సెలబ్రిటీలు ప్రశంసలు జల్లుకురిపించారు. అవని ఈ రంగం ఎంచుకోవడానికి కారణం అవని కుటుంబసభ్యులే.. తన సోదరుడు కూడా ఆర్మీలోనే లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. చిన్ననాటి నుంచే కల్పనా చావ్లా అంతటి గొప్ప ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే ఈ యంగ్ పైలట్... ఏపీజే అబ్దుల్ కలాం వంటి వారినే స్పూర్తిగా తీసుకుని ఈ రంగంలోకి వచ్చానని చెబుతున్నారు. 2016 జూన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అవని.. IAF ఎగ్జామ్స్‌లో సత్తా చాటింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 6 నెలల శిక్షణ తీసుకుంది. స్టేజ్ 3 ట్రైనింగ్ బీదర్‌లో పూర్తి చేసుకుని యుద్ధ విమానాలు నడిపే విభాగంలోకి వచ్చింది.ఈ రంగంలో ఇంత ప్రతిభ చూపినందుకు 2018 అక్టోబర్ 7న బనస్థలి విద్యాపీఠ్ తనకి డాక్టరేట్ ప్రధానం చేసింది. భారత దేశ రక్షణా రంగంలో అత్యంత క్లిష్టంగా భావించే యుద్ధ విమానాలను నడిపే పైలట్ గా వాణి అందిస్తున్న సేవలకు, ఆమె తెగువకు సలాం చేస్తుంది మహిళాలోకం .

Related News