//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్మోకింగ్ కు దూరం అవుతున్న భారత యువత !

Category : national health

భారత దేశంలో యువతరం స్మోకింగ్ కు క్రమంగా దూరం అవుతున్నది. తాజాగా జరిపిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే లో 15 నుండి 24 ఏళ్ళ వయస్సు గల యువతలో స్మోకింగ్ అలవాటు 2009-10 నుండి 2016-17ల మధ్య 18.4 శాతం నుండి 12.4 శాతానికి తగ్గిన్నట్లు తెలుస్తున్నది. అంటే 6 శాతం తగ్గింది. 

దేశంలో  స్మోకింగ్ చేసే యువత సంఖ్య 81 లక్షలు తగ్గడం పట్ల కేంద్ర ఆరోగ్య  మంత్రి జెపి నడ్డా సంతోషం వ్యక్తం చేశారు. యువతరంలో ఈ అలవాటు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నదని ఆయన పేర్కొన్నారు. 

ప్రపంచంలో పొగాకు వాడకం అలవాటు తగ్గించడంలో భారత్ జరుపుతున్న కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహితం ప్రశంశించడం గమనార్హం. ప్రభుతం ఎక్కువగా యువతరంపైననే ద్రుష్టి సారిస్తున్నామని  అంటూ స్మోకింగ్  అలవాటు 15 నుండి 17 ఏళ్ళ మధ్య వయస్సు గల మైనర్ యువతలో  54 శాతం తగ్గినదని,18 నుండి 24 ఏళ్ళ మధ్య వయస్సు గల యువతలో 28 శాతం తగ్గినదని కేంద్ర మంత్రి వివరించారు. 

అయితే 125 కోట్ల మంది జనాభా గల భారత్ లో పొగాగు వినియోగ నియంత్రణకు మరెంతో కృషి చేయవలసి ఉంది. వయోజనులలో ప్రతి ఐదుగురిలో ఒకరు, అంటే 19.9 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు. అట్లాగే ప్రతి పది మందిలో ఒకరు, అంటే 10 కోట్ల మంది స్మోకింగ్ చేస్తున్నారు. దేశంలో పొగాకు వినియోగాన్ని 2020 నాటికి 15 శాతంకు, 2025 నాటికి 30 శాతం మేరకు తగ్గించాలని జాతీయ ఆరోగ్య విధానం-2017లో లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్టుకోంది.