//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యుద్ధభూమిలోకి సిద్ధపడుతున్న భారతీయ మహిళలు

Category : national

మహిళలను వంటింటికి పరిమితం చేసే రోజులు పోయాయి. నేడు వారు అంతరిక్షంలో కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధ భూమిలో కూడా కాలు పెట్టడానికి భారత మహిళలు సిద్ధం కాబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం కొన్ని దేశాల్లో వున్నట్లుగా సైన్యం తరుపున కదనరంగంలోకి మహిళలను అనుమతించాలని భారత సైన్యం యోచిస్తుంది.

ప్రస్తుతం దేశ ఆర్మీలోని వైద్య, న్యాయ, విద్య, సిగ్నిల్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలకమైన కదనరంగంలోకీ మహిళలను అనుమతించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే సైన్యంలో లింగ వివక్ష లేదని, భారత్‌ను కూడా త్వరలో అవిధంగా తయారు చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం సైన్యం పురుషులకు అనుకూలంగా వుందని, త్వరలోనే మిలటరీ పోలీసు విభాగంలో మహిళలను నియమిస్తామని తెలిపారు.చరిత్రలో తొలిసారిగా గత ఏడాదిలో భారత వాయు సేనలో ముగ్గురు మహిళలను ఫైటర్‌ పైలట్స్‌గా నియమించారు. ప్రయోగాత్మక ప్రాతిపదికన వాయు సేన యుద్ధ విభాగంలోకి ముగ్గురు మహిళలను ప్రభుత్వం అనుమతించింది. వీరు ప్రస్తుతం వాయు సేన ఫైటర్‌ బృందంలో కీలకం వున్నారు. 


అలాగే, భారత నౌకదళంలో కూడా మహిళలను అనుమతించాలనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ఇప్పటికే భారత నేవీలో న్యాయ, రవాణా, నౌకా నిర్మాణం, ఇంజనీరింగ్‌ విభాగాల్లో మహిళలు కొనసాగుతున్నారు. 'మహిళలు జవాన్లుగా రావాలని కోరుకుంటున్నాను. దీన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. మొదటగా, మిలటరీ పోలీసు జవాన్లతో దీన్ని ప్రారంభిస్తాం' అని రావత్‌ తెలిపారు.

ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమయిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం ముందుకు కూడా తీసుకుని వెళ్లామన్నారు. తరువాత పురుషల అధిపత్యం వున్న ప్రముఖ హోదాల్లో కూడా మహిళలును తీసుకుంటామన్నారు.  కార్యచరణ ఆందోళనలు, అనివార్య కారణాలతో యుద్ధ విభాగాల్లో మహిళలను అనుమతించలేదని తెలిపారు. 

అయితే జవాన్లుగా మహిళలను నియమించడానికి సిద్ధంగా వున్నామని అన్నారు.  పోరాటాల్లో ఎదురయ్యే సమస్యలను మహిళలు చిత్తు చేస్తారని రావత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్‌, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, నార్వే, స్వీడెన్‌, ఇజ్రాయల్‌ దేశాల్లో మాత్రమే మహిళలు మిలటరీ యుద్ధ విభాగంలో పని చేస్తున్నారు. ఈ దేశాల్లో మహిళలు ఎలాంటి లింగ వివక్ష లేకుండా మిలటరీలో అన్ని పాత్రలు పోషిస్తున్నారు.