ఇంగ్లాండ్‌లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్‌లో భారత మహిళలు సెమీఫైనల్ దిశగా దూసుకెళ్తున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 16 పరుగులతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ టోర్నిలో భారత్‌కు ఇది వరసగా నాలుగో విజయం.
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్‌లో దీప్తి శర్మ (78), మిథాలీ రాజ్ (53) అర్థ సెంచరీలతో 232 పరుగులు చేసింది. తరువాత లక్ష్యసాధనకు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత మహిళా క్రికెటర్లు శ్రీలంకను 16 పరుగుల తేడాతో ఓడించింది.
అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లంక మహిళలు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 216 పరుగులు మాత్రమే చేసి 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో అత్యధికంగా వికెట్ కీపర్ మండోదర 61 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు చివరికంటా పోరాడినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత బ్యాట్స్ ఉమన్ దీప్తి శర్మకు మ్యాన్ ఆఫ్ ది ఉమన్ అవార్డు లభించింది.
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా కూడా నాలుగు విజయాలు సాధించినప్పటికీ, మెరుగైన నెట్ రన్‌రేట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ లీగ్ దశలో ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే సెమీస్ బెర్తు దాదాపుగా మిథాలీ సేన సొంతమైనట్లే. శనివారం తన తర్వాతి మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది.