అట్టహాసంగా ప్రారంభమైన 11వ ఐసిసి మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌కు భారత్ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్లోను, ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుపుల మెరిపించిన మిథాలీ సేన తొలి బోణీ చేసింది. దీంతో టైటిల్ ఫేవరేట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌కు భారత్ ఈ మ్యాచ్‌తో హెచ్చరికలు పంపినట్లైంది.
మిథాలీరాజ్ సేన స్ఫూర్తిదాయకమైన ఆటతో ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ నైట్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 281/3 భారీ పరుగులను సాధించింది.282 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లాండ్ 246 పరుగులకు కుప్పకూలింది.
భారత్ మెరుపు వేగంతో కూడిన ఫీల్డింగ్‌తో స్కోవర్, విల్సన్, బ్రంట్లను రనౌట్ చేయడంతో భారత్‌వైపు మ్యాచ్ మొగ్గింది.తొలుత వెనుకబడిన ఇంగ్లాండ్‌ను మిడిల్ ఆర్డర్లో విల్సన్ ఆదుకుంది.తొలి అర్ధ సెంచరీతో 81 పరుగుల చేసిన ఆమెను బిస్త్ రనౌట్ చేయడంతో మ్యాచ్ ఊహించిన మలుపు తిరిగింది.