విజయ వంతంగా మరో పర్యటన, మగవారికి ఏ మాత్రం తీసిపోము అంటూ, ఒకే పర్యటనలో రెండు సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్-దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ సిరీస్‌లో ఈ రోజు ఐదో టీ20 జరిగింది. ఇందులో ధాటిగా ఆడిన భారత మహిళల జట్టు 166 పరుగులు చేయగాఅనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది .
మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా అందులో .మిథాలీ రాజ్ (62 50 బంతుల్లో 4s-8 6s-3), జెమిమాహ్ రోడ్రిగస్ (44 34 బంతుల్లో 4s-3 6s-2) కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ (27 17 బంతుల్లో 4s-1 6s-2) ధాటికి ఆడారు , అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది
రాజేశ్వరి గాయక్వాడ్ , శిఖా పండేయ్, రుమేలి ధర, తలో 3 వికెట్లను సాధించి విజయం లో కీలక పాత్ర పోషించారు
ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత మహిళ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.