//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైల్వే ప్రయాణికులకి శుభవార్త

Category : national

భారతీయ రైల్వే తన ప్రయాణికులకి శుభవార్తని అందించింది.

అదేమిటి అంటే రైలు ప్రయాణాన్ని రద్దు చేసుకోవల్స్ వచ్చిన ప్రయాణికులకి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది రైల్వే. ప్రస్తుతం అయితే రైలు టికెట్‌ని ఓ సారి రిజర్వేషన్ చేసుకున్న తర్వాత.. మళ్లీ రద్దు చేసుకోవాలనుకుంటే ప్రయాణికుడికి తలకి మించిన భారమే, మరలా స్టేషన్ కి వెళ్లి ఫాం నింపి చేయించాలి ఇంతా చేయిస్తే కొంత కాన్సిలేషన్ చార్జెస్ కూడా పడతాయి.

అయితే ఇప్పుడు ఐల్వాయ్ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఇక పై ప్రయాణికుడు తాను వద్దనుకుంటే తన టికెట్‌ని వేరొకరికి బదీలు చేసుకోవచ్చు, అయితే ఇదంతా రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే జరగాలి. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే ఈ బదిలీకి సంబంధించిన లిఖిత పూర్వక అభ్యర్థనని ప్రయాణికుడు సంబంధిత రైల్వే అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ టికెట్ బదిలీ సౌకర్యం టికెట్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే అది కూడా ఒక్కసారి మాత్రమే ట్రాన్స్‌పర్‌కి వీలుంటుంది.

ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే :

ప్రయాణికుడు ఒకవేళ తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకున్నప్పుడు..ఆ టికెట్‌ని తనకి తెలిసిన వారు లేదా బంధువుల పేరుమీదకి బదిలీ చేసుకోవచ్చు.

కాని తన టికెట్‌ని ఎవరికి బదిలీ చేయాలనుకుంటున్నావో సవివరంగా పేపరుపై రాసి..దాన్ని ప్రధాన స్టేషన్లలోని చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్స్‌కి అందజేయాలి.

ఇప్పుడున్న రూల్ ప్రకారం.. తల్లిదండ్రులు , భార్య లేదా పిల్లలు ఇలా కుటుంబ సభ్యులకి మాత్రమే టికెట్ బదిలీ సౌకర్యం ఉన్నా.. వివాహ వేడుకల సమయంలో బంధువులకి కూడా టికెట్‌ని బదిలీ చేసుకునేలా మార్గదర్శకాలు విడుదల చేసింది రైల్వే.