భారత సీనియర్ పేసర్ మునాఫ్ పటేల్ గత కొంతకాలంగా జట్టులో స్థానం కోల్పోయి, జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి పురాగమనం చేయాలని ఆశిస్తున్నారు. ఈ సారి గుజరాత్ లయన్స్ తరుపున ఆడుతున్న మునాఫ్ భారత పిచ్ లపై ఎలా బౌలింగ్ చేయాలో తనకు తెలుసని చెప్పాడు.గతంలో భారత పిచ్‌లపై బౌలింగ్ చేసిన అనుభవం ఐపీఎల్లో ఉపయోగపడుతుందని, ‘‘భారత్‌లో పేసర్లు రాణించాలంటే ఇక్కడ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉండాలన్నాడు. గుజరాత్ జట్టులో అలాంటి అనుభవజ్ఞులకు కొదువ లేదు. నాతో పాటు ప్రవీణ్‌కుమార్, మన్‌ప్రీత్ గోని, ధవళ్ కులకర్ణి లాంటి పేసర్లు ఉన్నారు. ఇక్కడ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో మాకు తెలుసు. మా గురించి మాకు బాగా అవగాహన ఉంది. భారత ఆటగాడిగా మన పిచ్‌లపై బౌలింగ్ చేయడం కలిసొచ్చే అంశం. జట్టులోని సీనియర్లలో ఒకడినైనందుకు సంతోషంగా ఉంది. నా అనుభవాన్ని కుర్రాళ్లకు పంచుతా. ప్రత్యర్థి జట్టును వీలైనంత తక్కువ స్కోరుకే పరిమితం చేయడం మా లక్ష్యం’’ అని మునాఫ్ చెప్పాడు.