//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికాలోభారతీయుడిపై కాల్పులు

Category : national

అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలోని అట్లాంటాలో డిపార్ట్‌‌మెంటల్ స్టోర్స్‌ లో విధులు నిర్వహిస్తున్న భారతీయుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మీడియావర్గాలకు తెలిసిన సమాచారం ప్రకారం గుజరాత్‌కు చెందిన హస్‌ముఖ్ పటేల్(24) అట్లాంటాలోని ఒక స్టోర్‌లో పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం ఉద్యోగవేటలో అమెరికాకు వెళ్లారు. సోమవారం రాత్రి అతను పనిచేస్తున్న సమీర్ స్టోర్స్ మూసివేస్తున్నారు. ఇంతలో లోనికి చొరబడిన దుండగులు అతని నుంచి క్యాష్ రిజిస్ట్రర్ లాక్కునేందుకు ప్రయత్నించారు. హస్‌ముఖ్ పటేల్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ దుండగులు... కాల్పులకు పాల్పడ్డారు. అతని  కుటుంబ సభ్యులు పాట్నా సమీపంలోని సుంథేర్ గ్రామంలో నివసిస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అట్లాంటా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గడచిన 5 నెలల్లో యుఎస్‌లో ముగ్గురు భారతీయులపై దాడులు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.