మొదటి సారిగా భారత్ నుండి ఆస్ట్రేలియాకి మామాడి పండ్లను ఎగుమతి కానున్నాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మామిడి ఎగుమతులు ఈ ఏడాదే ప్రారంభంకావొచ్చు. ఆస్ట్రేలియా మ్యాంగో ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధి రాబర్ట్ గ్రే మాట్లాడుతూ బయోసెక్యూరిటీ నియమ నిబంధనలకు లోబడి ఎగుమతులు జరిగితే ఈ ఏడాది మామిడి సీజన్ ముగిసేలోగా భారతదేశంలోని మామిడి పండ్లు ఆస్ట్రేలియాకు చేరుతాయని తెలిపారు. ఇదే జరిగితే భారత్‌కు చెందిన మామిడి పండ్లు ఆస్ట్రేలియా చేరడం ఇదే తొలిసారి అవుతోంది. గ్లోబల్ ట్రేడ్‌కి అనుగుణంగా తమ దేశం నుంచి మామిడిపండ్లు ఇతర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ప్రాణానికి హాని చేసే ఎలాంటి క్రిమి సంహారక మందుల జోలికి వెళ్లకుండా తాము ఎగుమతులు చేపడుతున్నట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది.
గత కొన్నేళ్లగా మెక్సికో, ఫిలిఫ్పీన్స్, పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా నుంచి ఎగుమతులు కొనసాగుతున్నాయి. భారత్ నుండి అమెరికాకు మామిడి పండ్లు ఎగుమతి జరుగుతుంది. తమ దేశానికి ఏ రకం మామిడి పండ్ల రకాలను దిగుమతి చేసుకోవాలన్న దానిపై చర్చ జరుగుతోంది. తమ దేశం నుంచి ఆల్ఫాన్సో, కేసర్ రకాలు ఎక్కువగా ఎగుమతి అవుతాయని రాబర్ట్ తెలిపారు.