అమెరికాలో మరోఘోరం జరిగింది. యూఎస్ లోని టెన్నెస్సే లోని ఓహోటల్ పై దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మృతి చెందడం కలచివేస్తోంది. అమెరికన్ బెస్ట్ వాల్యూ సోర్స్ హోటల్ లో హౌస్ కీపర్ గా పని చేస్తున్న ఖండూ పటేల్ విధులు ముగించుకుని, హోటల్ వెనుక భాగంలో నడుస్తుండగా, దుండగుడు రహస్య ప్రాంతం నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఒక బుల్లెట్ తగిలిన ఖండూ పటేల్ నేలకూలాడు. తీవ్ర గాయాలపాలైన ఖండూపటేల్ ను ఆసుపత్రికి తరలించగా, తీవ్ర రక్తస్రావంతో ఆయన మృతి చెందారు. ఆయన ఎనిమిది నెలల క్రితమే అక్కడ జాయిన్ అయినట్టు సమాచారం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.