//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికాలో భారతీయులపై జరిగిన దాడులను ఖండించిన సుష్మాస్వరాజ్

Category : politics state national

భారతీయులు ఎక్కడ వున్నా వారి క్షేమం,భద్రతకు భారతదేశం అత్యంత ప్రాధాన్యతనిస్తుందిని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ భరోసానిచ్చారు.భారతీయులు ఎక్కడ వున్నా వారు కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సుష్మాస్వరాజ్ లోక్ సభలో తెలిపింది.అమెరికాలో భారతీయులపై జరిగిన వరస జాత్యహంకార దాడులపై ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందని ఆమె సభలో తెలిపారు.మన ప్రభుత్వం ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్తుందని,త్వరతగతిని విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకుందని ఆమె అన్నారు.

https://www.youtube.com/edit?o=U&video_id=0ae9MU0CHyg

అమెరికా యంత్రంగం కూడా సానుకూలంగా స్పందించి దాడులకు పాల్పడిన వారిపై సత్వరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అమెరికా అగ్ర నాయుకులు, ప్రెసిడెంట్ ట్రంప్ తో సహా ఈ ఘటనలను ఖండించారని ఆమె తెలిపారు.ఈ ఘటనపై ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందన్న ప్రతిపక్ష ఆరోపణలను ఆమె త్రోసిపుచ్చారు.కూచినబొట్ల శ్రీనివాస్ హత్య అనంతరం భారత ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ భార్య రాసిన లేఖను ఆమె సభలో ఉటంకించారు.ఈ చెదురు మదురు సంఘటనలవటం మూలంగా అమెరికా వెళ్లే వారికి ఏ విధమైన హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేయలేదని ఆమె వెల్లడించింది.ఇకపై ఇలాంటి దాడులు జరగ కూడదని ఆకాంక్షిద్దాం.