//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాట్సాప్‌ ని నిషేధించడానికి రెడీ అవుతున్న కేంద్ర ప్రభుత్వం..కారణం ఇదే...?

Category : national

తమ సమాచారాన్ని ఇతరులకు త్వరగా చేరవేసే యాప్ లలో వాట్సాప్‌. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యాప్ ని వాడుతున్నారు. ఇప్పుడు ఈ యాప్ పై భారత్‌లో నిషేధం విదిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం నకిలీ వార్తలు విస్తృతంగా ప్రచారం కావడమే. కానీ వాట్సాప్‌ యాజమాన్యం ఈ నకిలీ చారాన్ని అడ్డుకునేందుకు తగు చర్యలు కూడా తీసుకుంటుంది.Indian Govt May be Ban Whats App?

దీనిలో భాగంగా ఫార్వర్డ్‌ సందేశాలు ఐదుగురి కంటే ఎక్కువ మందికి పంపించే వీలు లేకుండా ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది దీనితో పాటు ఆ సందేశం పైన ఫార్వర్డ్‌ అని వస్తుంది. కానీ భారత ప్రభుత్వం ఈ నకిలీ వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు పుట్టిస్తున్నారనే తెలుసుకొనే విధంగా మార్పులు చేయమని వాట్సాప్‌ యాజమాన్యాన్ని కోరింది. ఇది ప్రైవేట్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినట్లువుతుందని కేంద్రానికి నో చెప్పింది వాట్సాప్‌. Indian Govt May be Ban Whats App?

వాట్సాప్‌ యాజమాన్యం నో చెప్పడంతో అసంతృప్తి గురైన కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వాట్సాప్‌ నకిలీ వార్తలను అడ్డుకుందుకు రేడియో ఇతర మాధ్యమాల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.Indian Govt May be Ban Whats App?