Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాట్సాప్‌పై బ్యాన్‌..! కార‌ణం తెలిస్తే షాక్ అవుతారు..!!

Category : technology national

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను బ్యాన్ చేయ‌నున్నారా..? అందు కోసం ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాల‌ను జ‌రుపుతుందా..? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. ఇందుకు కార‌ణం, వాట్సాఫ్‌లో న‌కిలీ వార్లు విస్తృతంగా ప్ర‌చారం కావ‌డ‌మేన‌ని తెలుస్తుంది. న‌కిలీ వార్త‌ల ప్ర‌చారాన్ని అడ్డుకునేందుకు వాట్స‌ప్ ఇప్ప‌టికే ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటుంది. Indian Government Will Ban WhatsApp In Country

ఇందులో భాగంగానే, ఫార్వ‌ర్డ్ మెసేజ్‌లు ఐదుగురికంటే ఎక్కువ మందికి పంపించేందుకు వీలు లేకుండా ఉండేలా ఫీచ‌ర్‌ను భార‌త్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు, ఏదైనా ఫార్వ‌ర్డ్ చేసి మెసేజ్ వ‌స్తే దానిపైనా ఫార్వ‌ర్డ్ అని వ‌స్తుంది. అయితే, ఈ న‌కిలీ వార్త‌లు అస‌లు ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నాయి..? ఎవ‌రు పుట్టిస్తున్నారు..? అనేదానికి సంబంధించిన వివ‌రాల‌ను క‌నిపెట్టేలా మార్పులు చేయాల‌ని ప్ర‌భుత్వం ఇటీవ‌ల వాట్స‌ప్ యాజ‌మాన్యాన్ని కోరింది.Indian Government Will Ban WhatsApp In Country

అయితే, అది క‌ష్ట‌త‌రం అవుతుంద‌ని వాట్స‌ప్ యాజ‌మాన్యం చెప్పిన‌ట్టు తెలుస్తుంది. ఇది ప్రైవేట్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన‌ట్టు అవుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి చెప్పింది. దీనిపై భార‌త ప్ర‌భుత్వం అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ నేపథ్యంలోనే న‌కిలీ వార్త‌ల విష‌యంలో వాట్సాప్‌కు మ‌రో సారి నోటీసులు పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తుంది.Indian Government Will Ban WhatsApp In Country

Related News