ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాలంటే అంత ఆషామాషీ విషయం ఏమి కాదు. అందరికి సాధ్యమయ్యే విషయము కాదు. అయితే గుజరాత్ కి చెందిన 16 ఏళ్ల యువతి ఈ అరుదైన ఘనత సాధించింది. నీలాంషి పటేల్ అనే 16 ఏళ్ల యువతి తన జుట్టు ని 5.7 అడుగుల పొడవుతో గిన్నిస్ రికార్డ్ సాధించింది.
తనకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు హెయిర్ కట్ చేయించినప్పుడు తాను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పింది నీలాంషి. తాను ఇంత పొడువైన కురులు పెంచడానికి తన ఎంతో సాయపడిందని చెప్పింది. నీలాంశ కురులను నిటారుగా కొలిస్తే, 67 అంగుళాల పొడవు తేలింది.
తాను వారానికి ఒకసారి తలంటి స్నానం చేస్తానని, ఆ తరువాత జుట్టును ఆరబెట్టుకునేందుకు గంటన్నర సమయం పడుతుందని, దువ్వేందుకు మరో గంట సమయం పడుతుందని, తన తల్లి ఇచ్చే మద్దతుతోనే ఇంత పొడవైన కురులున్నా సమస్యలు లేకుండా ఉన్నానని వెల్లడించింది. తాను ఎంతో ఇష్టపడి పెంచుకున్న కురులకు ప్రతిష్ఠాత్మక గిన్నిస్ రికార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది నీలాంషి.