//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికాలో మిర్యాలగూడ ఎన్ఆర్ఐ వైద్యుడి హత్య

Category : world

అమెరికాలో గత 28 ఏళ్లుగా సైక్రియాట్రిస్టుగా పనిచేస్తున్న అచ్యుత్ రెడ్డి తను చికిత్స చేస్తున్న రోగి చేతిలోనే హత్యకు గురయ్యాడు. చికిత్స చేస్తున్న సమయంలో రోగి అకస్మాత్తుగా కత్తి తీసుకుని అచ్యుత్ రెడ్డిపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దానితో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. సైక్రియాట్రిస్టుగా పనిచేస్తున్న అచ్యుత్ రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ. 57 ఏళ్ల అచ్యుత్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య వున్నారు. ఆయన అమెరికాలోనే వుంటున్నప్పటికీ స్వస్థలం మిర్యాలగూడంటే ఎంతో ఇష్టమని బంధువులు చెపుతున్నారు.

Related News