ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ భేటీ అయ్యారు. కాగా, గత ఏడు రోజుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశాల పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. యూరప్, ఇంగ్లండ్ నుంచి అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టే సంస్థలకు మార్గదర్శనం చేయాలని దినేశ్ కె.పట్నాయక్ సీఎం చంద్రబాబు కోరారు.