//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇప్పుడు చూస్తే వరల్డ్ క్లాస్ ప్లేయర్ ...అదే ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించిన సామాన్యుడు

Category : sports

జీవితంలో గెలవాలనే ఆలోచన ఉంటె సరిపోదు .గెలవడానికి కావాల్సిన ఆచరణ ఉండాలి...అనే విషయాన్ని నిరూపించాడు మన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్.క్రికెటర్ గా కెరీర్ ఆరభించక ముందు తాను జీవితంలో ఎదురుకున్న సవాళ్లు ,ప్రతిసవాళ్లకు నిదర్శనమే ప్రస్తుతం తానూ బ్రతుకుతున్న ఈ జీవితం.ఇండియాన్ క్రికెట్ టీం లో అతి తక్కువ కాలంలో పేస్ బౌలర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఆటగాడు ఉమేష్ యాదవ్.2010లో వన్డేల్లో, 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఆ తరువాత ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 108 మ్యాచ్‌లు ఆడి 108 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. 2012లో ఆసీస్‌లో పర్యటించి 4 టెస్టులో 14 వికెట్లతో రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచకప్‌లోనూ 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 70 ఇన్నింగ్స్ ల్లో 119 వికెట్స్ పడగొట్టాడు.ఓవరాల్ గా 33.47యావరేజ్ తో 3.59 ఎకానామీ తో కొనసాగుతున్నాడు.అలాగే 75 వన్డేల్లో 73 ఇన్నింగ్స్ లో 106 వికెట్స్ పడగొట్టాడు. ఓవరాల్ గా 33.33 యావరేజ్ తో 6.01 ఎకానామీ తో ఉన్నాడు.టి-20 క్రికెట్ లో ఆడింది తక్కువ మ్యాచులే అయినా వాటిలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.ఒక అంతర్జాతీయ ఆటగాడిగా తనదైన ప్రదర్శనతో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటేనే ఉన్నాడు. ఈ విషయాలన్నీ క్రికెట్ చేసే ప్రతి ఒక్కరికి తెలిసినవే కానీ .ఉమేష్ యాదవ్ ఈ స్థాయికి రావడం వెనుక తాను ఎదురుకున్న సవాళ్లు ,సమస్యలు,కష్ట- నష్టాల గురించి మనకు పెద్దగా తెలియదు.ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే ...మనకు తెలియని ఆ రెండో వైపు ఏంటో తెలియాలి అంటే మాత్రం ఇది చదవాల్సిందే..!

క్రికెటర్ కాకముందు:

ఉమేశ్‌ యాదవ్ అసలు పేరు 'ఉమేష్ కుమార్‌ తిలక్‌ యాదవ్‌'. మహారాష్ట్రలోని కరవు పీడిత ప్రాంతం విదర్భ. ఖపర్‌ఖేదా సమీపంలోని ‘వాలి’ స్వస్థలం.ఉమేష్ తండ్రి ఒక గని కార్మికుడు. ఆయనే కుటుంబాన్ని పోషించేవారు. ఉమేష్ కి ఒక అన్న కూడా ఉన్నాడు . తండ్రి కి సాయంగా కుటుంబ పోషణలో ఆసరాగా గోవాలో పనిచేసేందుకు వలస వెళ్లాడు. కటిక పేదరికంతో ఉన్న ఉమేశ్‌ 12వ తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది.పై చదువులు చదివే స్థోమత లేని కారణంగా ఏదో ఒక పనిలో చేరాక తప్పని పరిస్థితి. ఆ సమయంలోనే ఉమేష్ తండ్రి తనలా తన పిల్లలు గని కార్మికుల కావొద్దన్నది ఆయన ఆకాక్ష. అందుకోసమే ఉమేష్ ని పనిలో చేర్చ కుండా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించమని కోరాడు.

త్వరగా ఉద్యోగం సాధించాలి అంటే అప్పుడు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సైన్యంలో చేరడం.ఆ ఆలోచన తోనే సైన్యానికి దరఖాస్తు చేశాడు. కానీ అక్కడ కూడా ఉమేష్ ఆశ ఫలించలేదు. సైన్యం నుంచి నిరాశే ఎదురైంది.ఆ నిరాశ నుంచే ఈ సారి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. దేహదారుఢ్య పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించాడు.కానీ వ్యక్తిగత వ్రాత పరీక్షలో 2 పాయింట్లతో మిస్సయ్యాడు. ఆ క్షణములో ఏం చేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితి.

క్రికెటర్ గా మొదటి అడుగు:

అలాంటి దిక్కు తోచని సందర్భంలోనే..... ఎన్నో రకాల ఆలోచనల నడుమ అతడు టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ను తాత్కాలిక గమ్యంగా ఎంచుకున్నాడు .మొదటి నుంచి స్పీడ్ గా బాల్ ని విసరడంలోనూ ,బౌలింగ్ చేయడంలోనూ... తాను ఆడే జట్టుకు విజయాన్ని అందించడంలో ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు... ఆ విధంగా తన జట్టు గెలిస్తే, మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ ద్వారా 6-10,000 వచ్చేవి.అలా వచ్చిన డబ్బుతో రెండు మూడు నెలలే గడిచేది . అందుకే తన కళాశాల జట్టుకు ఆడేందుకు ప్రయత్నించాడు. క్లబ్‌ క్రికెట్‌ ఆడకపోవడంతో అవకాశం రాలేదు. అందుకే కసిగా క్లబ్‌ క్రికెట్‌ మొదలు పెట్టాడు. ఇక ఆ రోజు నుంచి ఏ రోజూ క్రికెట్‌ ఆడకుండా ఉండలేదు ఉమేశ్‌.

2006-08 ప్రాంతంలో లెదర్‌ బాల్‌ క్రికెట్‌లో ప్రవేశించాడు. విదర్భ జింఖానా తరఫున వన్డేల్లో ఆడాడు. స్పైక్‌‌ షూ లేకుండానే వట్టి కాళ్లతో తొలి మ్యాచ్‌లో పది ఓవర్లు విసిరాడు. 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వేగంగా, అద్భుతంగా యార్కర్లు వేస్తున్నాడని అతడి పేరును ఎవరో విదర్భ క్రికెట్‌ సంఘానికి సూచించారు. ఓ అధికారి టీ-20ల్లో ఉమేశ్‌ ప్రతిభను గమనించాడు. అప్పటికే నాగ్‌పుర్‌ జట్టు అంతర్‌ జిల్లా మూడు రోజుల టోర్నీలో సెమీస్‌లో అడుగు పెట్టింది. అమరావతి వెళ్లి సెమీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 3, ఫైనల్లో 8 వికెట్లు పడగొట్టాడు. అప్పుడే విదర్భ సారథి గాంధి అతడి ఆటకు ముగ్ధుడయ్యాడు.

క్రికెటర్ గా టర్నింగ్ పాయింట్ :

విదర్భ కెప్టెన్ గాంధి ప్రోత్సాహంతో ఉమేశ్‌ లోని అంతర్జాతీయ ఆటగాడు మేలుకున్నాడు. ఆ ఎంకరేజ్ మెంట్ తో నే విదర్భ నుంచి టీమిండియాకు ఎంపికైన మొదటి ఆటగాడిగా చరిత్ర కెక్కాడు. ఆ తరువాత ఉమేశ్‌ ఎయిరిండియా తరఫున ముంబయిలో ఓ మ్యాచ్‌ ఆడే ఏర్పాటు చేశాడు. దాంతో అతడికి ఆ సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్‌ లభించింది. ఇక విదర్భ రంజీ జట్టు ప్రాబబుల్స్‌లో అతడికి చోటు లభించింది.ఈ సమయంలో అతని పై కొన్ని విమర్శలు ఆరంభం అయ్యాయి . ప్రొఫెషల్‌ క్రికెటర్‌గా అనుభవం లేదని ఇతరులు అభ్యంతరం చెప్పారు. కానీ గాంధి ఊరుకోలేదు.

ఉమేష్ లో ఉన్న అపారమైన నైపుణ్యాన్ని వారికీ తెలియజేసే ప్రయత్నం చేసాడు.దానికి మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో చోటి దక్కింది . దాంతో లెదర్‌ బాల్‌ చేతబట్టిన నెలరోజులకే ఉమేశ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ అయ్యాడు. మధ్యప్రదేశ్ పై తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి కోచ్‌, జట్టు సభ్యుల నోరు మూయించాడు. బెంగాల్‌పై 6 వికెట్లు తీశాడు. నాలుగు రంజీ మ్యాచుల్లో 20 వికెట్లు తీసి దులీప్‌ ట్రోఫీకి ఎంపికయ్యాడు. సౌత్‌‌ జోన్‌పై ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో అప్పటి మేటి ఆటగాళ్లు అయినా రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ వికెట్లు కూడాతీసి తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు... . ఇక అంతే ఆ దెబ్బతో ఉమేష్ దశ తిరిగింది. ఆ తరువాత అంతర్జాతీయ క్రికెట్ లో స్తానం సంపాదించి. తనదైన ఆట తీరుతో టీమిండియా గెలుపులో పాత్ర వహిస్తున్నాడు ఉమేష్.