//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చిన్న వయసులోనే కెప్టెన్ భాద్యత

Category : sports

మిథాలి దొరైరాజ్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్, ప్రపంచ కప్ గెలవడానికి తను ముందుండి తన సేనను ముందుకు నడిపించింది, కానీ ఎంత పోరాడిన ఫలితం లేకపోయింది. ప్రపంచ కప్ ఇంగ్లీష్ జట్టు కైవసం చేసుకుంది. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా ఉంటున్న మిథాలీ పుట్టింది జోధ్ పూర్.. రాజస్థాన్ లోనే ,ఆమె తల్లి తమిళ్ లీల రాజ్ తండ్రి దొరై రాజ్, మిథాలీ రాజ్ పెరిగింది హైదరాబాద్ .. తన చదువు మొత్తం సికింద్రాబాద్ లోనే .. తన 10 వ ఏటా సోదరుడి తో పాటుగా బ్యాట్ పట్టి గ్రౌండ్ కెళ్లి ప్రాక్టీస్ చేసేది ఇలా ఉంటుండగానే క్లాసిల్ డాన్స్ కూడా నేర్చుకుంది. కానీ తన కెరీర్ ను పూర్తిగా క్రికెట్ కె అంకితం చేసింది. 17 వ ఏటా ఇండియన్ టీం కి సెలెక్ట్ అయ్యింది, ఆమె ప్రతిభకు మెచ్చి స్టేట్ గౌర్నమెంట్ 2013 లో పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది.ఇప్పుడు మిథాలీ మహిళా క్రికెట్ లలో నెంబర్ వన్ ర్యాంకర్ అయ్యింది.

మిథాలి తన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాజీవితంలో 93 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 45.50 సగటుతో 2776 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 20 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 114 నాటౌట్. టెస్టులలో 8 మ్యాచ్‌లు ఆడి 52 సగటుతో 522 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు. ఇదే ఆమె యొక్క ఏకైక సెంచరీ. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది.