//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చైనా, పాక్‌ ల‌తో యుద్ధానికి సిద్ధం

Category : national

ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ లో అలజడికి పాకిస్థానే కారణమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా, కశ్మీర్‌ యువతను పాక్ రెచ్చగొడుతోందని రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ లో పరిస్థితులు త్వరలోనే చక్కబడి, ప్రశాంతత నెలకుంటుందని చెప్పారు. పాకిస్థాన్, చైనా‌తోపాటు కశ్మీర్ పరిస్థితుల గురించి రావత్ మాట్లాడుతూ రెండున్నర యుద్ధాలను ఎదుర్కోడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఆర్మీ ఆధునికీకరణకు సంబంధించిన పురోగతి బాగుందని రావత్ అన్నారు. ఈ విషయంలో సమతూకం పాటిస్తున్నామని వివరించారు. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ లోకి చొరబడుతున్న ముష్కరులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గురువారం కూడా దేశంలోకి చొరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు తీవ్రవాదులను సైన్యం హతమార్చిందని, ఈ ఘటనలో ఓ జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడని తెలియజేశారు. చైనాతో వివాదాలు గురించి కూడా రావత్ ప్రస్తావించారు. భారత్, చైనా సరిహద్దుల్లో గత 40 ఏళ్లుగా ఒక్క బుల్లెట్‌ కు వాడలేదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేశారు.