Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నౌషెరాలో పాక్ ఆర్మీ పోస్టులు నేలమట్టం

Category : world

భారత్ లోకి తీవ్రవాదులు చొరబడేందుకు పాకిస్థాన్ ఆర్మీ స‌హ‌క‌రిస్తున్న‌ద‌ని భార‌త ఆర్మీ పేర్కొన్న‌ది. జమ్మూ క‌శ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌ వద్ద ఉన్న పాకిస్థాన్ ఆర్మీ పోస్టుల‌ను ధ్వంసం చేసినట్లు, నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద జ‌రుగుతున్న దాడుల‌కు సంబంధించి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నారులా మీడియాతో మాట్లాడారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజ‌ర్ల చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు భార‌త్ కూడా దాడులు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద భార‌త ఆర్మీ ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. హిమాల‌యాల్లో మంచు క‌ర‌గ‌డం వ‌ల్ల మ‌ళ్లీ చొర‌బాటులు ఎక్కువ‌య్యే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

Related News