//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ గ్యాంగ్ మొత్తాన్ని లేపేసిన ఇండియన్ ఆర్మీ

Category : national

బుర్హాన్ వని గ్యాంగ్ మొత్తాన్ని ఇండియన్ ఆర్మీ లేపేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కల్లోలం సృష్టించడానికి గాను రెచ్చిపోతున్న గ్యాంగ్ ని గ్యాంగ్ లీడర్ తో సహా మొత్తాన్ని లేపేసింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులు ముఖానికి ముసుగు లేకుండా ఆయుధాలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో 2015లో ఈ ఫోటో సంచలనం సృష్టించింది. కశ్మీర్‌లో అనేకమంది యువతీ యువకులను ఉగ్రవాదంలోని రిక్రూట్ చేసుకున్న బుర్హాన్ గ్యాంగ్...

దేశ వ్యతిరేక కార్యకలాపాల్లోకి వారిని ఉసిగొల్పింది. ‘‘బుర్హాన్ బోయ్స్’’గా స్థానిక యువకులకు ఉగ్రవాదం వైపు గాలం వేసిన ఈ గ్యాంగ్‌లో మొత్తం 11 మంది ఉన్నారు. అందులో గ్యాంగ్ లీడర్ బుర్హాన్ వనీ సహా 10 మందిని మట్టుబెట్టగా.. తారిఖ్ పండిట్ అనే ఉగ్రవాది 2016లో లొంగిపోయాడు. చివరివాడు సద్దాం పద్దార్ ఆదివారం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో చనిపోయాడు. దీనితో భారత ఆర్మీ ఉగ్రవాదంపై అతిపెద్ద విజయం సాధించినట్లు అయింది. దీనితో భారత అర్మీపై ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.