//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ సైనిక శక్తి విన్యాసాలు

Category : national

భారత్ ఇటీవల రాజస్థాన్ లో ‘ది థార్‌ శక్తి విన్యాసాలు’ అనే పేరుతో భారీ సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భారీగా ట్యాంక్‌లు, శతఘ్నులు, తేలిక పాటి వాహనాలు, నిఘా పరికరాలు, ఎయిర్ పోర్సుకు చెందిన హెలికాప్టర్లు, దాదాపు 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. దళాల యుద్ధ సన్నద్ధత పరీక్షించేందుకు దీనిని నిర్వహించారు. పాకిస్థాన్ తో సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్న సమయంలో ఈ విన్యాసాలు నిర్వహించటం విశేషం. ఈ విన్యాసాలను ఏప్రిల్‌ 10-16 వరకు నిర్వహించనున్నారు. దీనిపై సైన్యం స్పందిస్తూ దళాలు వేగం, పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేసుకోవడం వంటి అంశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక సమయాల్లో గగనతల పోరులో దళాల చురుకుదనాన్ని కూడా పరీక్షించినట్లు సైన్యం తెలిపింది. ఈ విన్యాసాలను చేతక్‌ కోర్ప్స్‌ జీవోసీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అశ్విన్‌ కుమార్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.