//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రెండు మిగ్ యుద్ధ విమానాలు కుప్పకూలాయి...ఇద్దరు పైలెట్స్ దుర్మరణం

Category : national

మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్-2 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి ఇరు దేశాల సరిహద్దు వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ప్రతిదాడికి దిగే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలతో భారత్ సైన్యం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగానే భారత ప్రభుత్వం నిన్న త్రివిధ దళాలకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది.ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి శ్రీనగర్ పరిసరాల్లో ఎయిర్ పెట్రోలింగ్ చేపట్టారు. భారత్ అమ్ములపొదిలో ఉన్న అన్ని రకాల యుద్ధ విమానాలు గగనతలంలో తిరుగుతూ పహారా కాస్తున్నాయి. రవాణా విమానాలు సైతం సైనిక స్థావరాలకు కావాల్సిన వస్తువులను చేరవేస్తూ కట్టు దిట్టమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది.

ఈ సమయంలోనే ఈ రోజు ఉదయం గగన విహారం చేస్తున్న ఎమ్ఐ-17 రవాణా చాపర్ బుద్గాం సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. యుద్ద విమానం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారని అధికారులు వెల్లడించారు. రొటీన్‌ సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందా, యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు.

సమాచారం అందుకున్న సైన్యం అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టింది.పైలట్ల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. చాపర్ సాంకేతిక లోపంతో కూలిందా...? ప్రమాదవశాత్తూ కూలిందా.....? అన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగ్‌ యుద్ధ విమానం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related News