//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

`రొమ్ము పాలు' కోసం భారతీయ పురుషుల ఆసక్తి !

Category : editorial

బిడ్డల ఆరోగ్యానికి తల్లి పాలు శ్రేయస్కరం అని అందరూ అంగీకరిస్తారు. అయితే వివిధ సంకోచాలు కారణంగా తమ బిడ్డలకు తమ పాలు ఇవ్వడానికి ఆధునిక యువతులు సందేహిస్తున్నారు. చాలామంది పుట్టినప్పటి నుండి బిడ్డలకు `డబ్బా పాలు'నే ఇస్తున్నారు. 

అయితే భారత దేశంలో చాలామంది పెద్దలు మాత్రం తమ జీవిత భాగస్వామి నుండి `రొమ్ము పాలు' కోరుకొంటున్నారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్త సేథ్ స్టీఫెన్స్ డావిడోవిట్జ్ తాను వ్రాయబోతున్న "ప్రతివారు అబద్దాలాడతారు" (ఎవరీ బాడీ లైస్) అనే గ్రంధం కోసం సమాచారం సేకరిస్తున్న సమయంలో భారత దేశానికి సంబంధించి విస్మయం కలిగించే ఈ అంశాన్ని తెలుసుకున్నారు. 

గూగుల్ లో "నా భర్త నా నుండి.... ..... కోరుకొంటారు" అనే సైట్ ని భారత దేశంలో  సెర్చ్ చేస్తున్న పురుషులలో  అత్యధికులు `రొమ్ము పాలు" కోసం అని రావడం గమనార్హం. వెబ్ సైట్ లో వీక్షించే నీలి చిత్రాలలో సహితం పెద్దలు రొమ్ము పాలు త్రాగడం ఎక్కువగా ఉంటున్నది. 

అయితే ఈ విషయంలో భారత్ మాత్రమే ఒంటరి దేశం కాదు. 2014లో టైమ్ పత్రిక ప్రచురించిన కవర్ స్టోరీ లో ప్రపంచం అంతా ఇటువంటి ధోరణి ఉన్నట్లు కనుగొన్నారు. "నా భర్త విడి పోవాలి అనుకొంటున్నాడు", "నా భర్త ఒక బిడ్డ కావలి అనుకొంటున్నాడు" అని కోరుకొనే వారిని కలిపినా "రొమ్ము పాలు" కావలి అనుకొంటున్న వారితో సమానం కావడం లేదని ఆ పత్రిక తెలిపింది. 

కానీ,  గూగుల్ సెర్చ్ ప్రకారం ఇటువంటి కోర్కె అమెరికాలోని మగవారిలో తక్కువగా ఉన్నట్లు స్టీఫెన్స్ చెప్పారు. చైనా, జపాన్ లలో కూడా ఇటువంటి అలవాటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. 2014లో పోలీస్ లు పెద్దలకు యువతులు రొమ్ము పాలు అందించే ఒక ముఠాను చైనాలో పట్టుకోవడం సంచలనం కలిగించింది. 

చైనాలో పడుపు వృత్తిలో ఉన్నవారిలో వేలాది మందికి  `రొమ్ము పాలు' అందించడం పెద్ద వ్యాపారంగా కొనసాగుతున్నది. అయితే పలువురు తాము పౌష్టికాహారం కోసం `రొమ్ము పాలు' కోరుకొంటున్నట్లు చెబుతున్నారు. 

అవసరమైన వారు నేరుగా రొమ్ము నుండే పాలు త్రాగవచ్చని, మొహమాట పడేవారు ఒక పైప్ ద్వారా త్రాగవచ్చని ఇటువంటి వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తి చెప్పారు. జపాన్ లో అయితే క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బార్ లలో `తాజా రొమ్ము పాలు' ను అందజేస్తారు. 

కాగా,  భారతీయ వనితలు భర్తల నుండి అటువంటి విపరీత కోర్కెలు వినడంతో కలవర పడుతున్నారు.  వెంటనే సుముఖత వ్యక్తం చేయడానికి వెనుకాడుతున్నారు. ఇటువంటి భర్తల ధోరణిని వైద్యుల ముందు ప్రస్తావించడానికి సహితం సిగ్గుపడుతున్నారని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 

Related News