భారత్-ఇంగ్లాండ్ మధ్య వన్డే సమరం నేటి నుండి ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతోంది.
ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో స్థానం కోల్పోయాడు. అతడి స్థానంలోనే కౌల్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇండియా బౌలర్లు కొంచెం ఆచితూచి బౌలింగ్ చేస్తున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్. 37 / 0.