//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Category : sports

భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్నఆరో వన్డేలో టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

ఆరు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 4-1తో సొంతం చేసుకున్న కోహ్లి సేన శుక్రవారం నామమాత్రపు వన్డేను ఆడనుంది. ఆరో వన్డే ప్రయోగాలకు వేదిక అవుతుందని అందరూ భావించారు. అయితే కేవలం భువనేశ్వర్‌కు మాత్రమే ఈ వన్డేలో విశ్రాంతినిచ్చారు.

అతనికి బదులుగా శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చారు. భారత జట్టు: శిఖర్‌ ధావన్‌, రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌), శూర్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బూమ్రా, యజువేంద్ర చాహల్‌

Related News