//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చాంపియన్‌ మిథాలీ సేన

Category : sports

మిథాలీ సారథ్యంలోని టీమిండియా నాలుగు దేశాల ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. టోర్నీ మొత్తం అద్భుత ఆటతో అలరించిన మిథాలీ సేన ఫైనల్లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాను ఎనిమిది వికెట్లతో చిత్తు చేసింది. 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళలు ఇంకా 17 ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ (70 పరుగులు, 92 బంతులు, 12 ఫోర్లు, ఒక సిక్స్‌), మిథాలీ రాజ్‌ (62 పరుగులు, 79 బంతులు, 10 ఫోర్లు) అజేయ అర్ధ శతకాలతో సత్తా చాటారు. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. పేసర్లు జులన్‌ గోస్వామి (3-22), శిఖా పాండే (2-23), లెగ్‌స్పిన్నర్‌ పూన మ్‌ యాదవ్‌ (3-32)ల ధాటి కి 40.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. రౌత్‌ ‘ఉమన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా, దీప్తి శర్మ ‘ఉమన్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా ఎంపికయ్యారు. ఇక మిథాలీరాజ్‌ ఈ మ్యాచ్‌తో భారత్‌కు 100 వన్డేల్లో సారథ్యం వహించిన రికార్డు సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయం ..వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో ప్రారంభమయ్యే ప్రపంచక్‌పలో భారత్‌ ఆత్మవిశ్వాసం పెంచనున్నది.