ఆరు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ఇక్కడి న్యూ వాండరర్స్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుసగా మూడు వన్డేలు గెలిచి ఊపు మీదున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా, ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా భారత్ వరుస విజయాలకు బ్రేక్ వేయాలని సఫారీ జట్టు పట్టుదలతో ఉంది.
గాయం కారణంగా గత మూడు వన్డేలకు దూరమైన డివిలియర్స్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగుతుండడంతో జట్టుకు అదనపు బలం చేకూరింది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, అజింక్యా రహానె, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్.
దక్షిణాఫ్రికా జట్టు: అయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జీన్ పాల్ డుమినీ, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, పెహ్లుక్వాయో, కగిసో రబడ, ఎన్గిడి, మోర్న్ మోర్కెల్.