//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అడుగుదూరంలో విజయం.......ఆశలన్నీ కోహ్లీ పైనే....!

Category : sports

విజయం మనదే అనిపిస్తుంది.. కానీ ఓటమి ముప్పు పొంచి ఉంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ మరోసారి చెత్త బ్యాటింగ్‌తో నిరాశపరిచిన సమయాన .. తొలి టెస్టులో టీమ్‌ ఇండియా చూపు మళ్లీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపైనే. అశ్విన్‌ మాయతో, ఇషాంత్‌ పేస్‌తో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 87/7కు పరిమితం చేసిన భారత్‌.. పట్టు సడలించి ఆ జట్టును 180 దాకా వెళ్లనిచ్చింది. అయినా లక్ష్యం స్వల్పమే కేవలం 194.

కానీ అదే టీమ్‌ ఇండియాకు భారంలా కనిపిస్తుంది. ఇంగ్లాండ్‌ పేస్‌ ధాటికి విజయ్‌, ధావన్‌, రాహుల్‌, రహానె, అశ్విన్‌ క్యూ కట్టేశారు. ఒక్క కోహ్లి లేకుంటే మూడో రోజే భారత్‌ ఆశలు ముగిసేవి. దృఢ సంకల్పంతో నిలిచిన అతడు మరోసారి బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. తోడుగా కార్తీక్‌ ఉన్నాడు. అతడు, మిగతా వాళ్లు కోహ్లి పోరాటానికి ఎంత సహకరిస్తారన్నదే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించనుంది.

ఇటు స్పిన్ను.. అటు పేసు. టీమ్‌ఇండియా బౌలింగ్‌ దాడితో ఇంగ్లాండ్‌ ఉక్కిరిబిక్కిరైపోయింది. గిరాగిరా బంతులతో అశ్విన్‌.. పదునైన పేస్‌, స్వింగ్‌తో ఇషాంత్‌శర్మ ఆంగ్లేయుల పతనాన్ని శాసించారు. ఓవర్‌నైట్‌ 9/1తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టు పతనం ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టలేదు.