ఆసియా కప్‌లో భాగంగా ఈ రోజు భారత్ పాకిస్థాన్‌తో మధ్య జరుగుతున్నమ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి 43 .1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యుంది. పాకిస్తాన్ తరుపున బాబర్ 47 , మాలిక్ 43 పరుగులు చేయగా మిగిలిన వారందరు చేతులెత్తేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మరియు జాదవ్ లు 3 వికెట్స్ తీయగా, బుమ్రా రెండు మరియు కులదీప్ ఒక వికెట్ తీసాడు.
163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 29 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 164 పరుగులు చేసింది. ఈ కీలక పోరులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ (52) చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 46 పరుగులు చేసి అవుటయ్యాడు. తరువాత అంబటి రాయుడు (31), దినేష్ కార్తీక్ (31) పరుగులతో జట్టును గెలిపించారు. మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా భువనేశ్వర్ కుమార్ ఎంపిక చేసారు.