రోహిత్ సారథ్యంలో ఆసియా కప్ గెలిచినా టీం ఇండియా ఇప్పుడు మరో సమరానికి రెడీ అవుతుంది. ఇండియాలో జరుగుతున్నా ఈ టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ తో భారత్ జట్టు తలపడనుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడే 15మంది జట్టు సభ్యుల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ టీంకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా.. అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
అయితే ఈ 15 మంది జట్టు సభ్యులలో మయాంక్ అగర్వాల్, మహ్మద్ సిరాజ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 4న రాజ్‌కోట్‌లో, రెండో టెస్ట్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరుగనున్నాయి. బీసీసీఐ ప్రకటించ్చిన జట్టు వివరాలు ఇవే
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, పృద్వీ షా, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారీ, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.