//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ కొత్త సంవత్సరం రోజున ఎంత మంది పుట్టారో తెలుసా ?

Category : world

ప్రజానీకం కొత్త ఏడాదిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

అంత గొప్పగా చేసుకునే జనవరి 1న బిడ్డకు జన్మనివ్వాలని ఏ తల్లి మాత్రం కోరుకోదు. అలా 2018, జనవరి 1న కూడా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3 లక్షల 86 వేల మంది జన్మించినట్లు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) తన నివేదికలో వెల్లడించింది. ఇందులోనూ ఇండియానే టాప్.

మన దేశంలో ఆ రోజు మొత్తం 69,070 మంది జన్మించినట్లు యూనిసెఫ్ తెలిపింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జననాల్లో సగం 9 దేశాల్లోనే ఉన్నట్లు కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇండియా తర్వాతి స్థానాల్లో చైనా (44760), నైజీరియా (20210), పాకిస్థాన్ (14910), ఇండోనేషియా (13370), అమెరికా (11280), కాంగో (9400), బంగ్లాదేశ్ (8370) ఉన్నాయి.

అయితే ఇక్కడ బాధ పడాల్సిన విషయం ఏమిటంటే ఈ చిన్నారుల్లో చాలా తొలి రోజే మృత్యవాత పడ్డారు. 2016లో ప్రతి రోజు జన్మించిన చిన్నారుల్లో అదే రోజే మృత్యువాత పడినవారి సంఖ్య సగటున 2600గా ఉంది. ఇక 20 లక్షల మంది తొలి వారంలోనే కన్ను మూస్తున్నట్లు కూడా యూనిసెఫ్ తన నివేదికలో వెల్లడించింది.

ఇండియాలో జననాలు ఇదే స్థాయిలో ఉంటే..త్వరలోనే చైనాను మించి భారత్ తొలి స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తున్నదని యూనిసెఫ్ చెప్పింది.

Related News