అవినీతి రహిత భారతం కోసం తపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నా జర్మనీకి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) చేసిన సర్వే ప్రకారం ఆసియాలో అత్యంత అవినీతి జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో వియత్నాం, థాయిలాండ్, పాకిస్థాన్, మయన్మార్‌లను భారత్ వెనక్కి నెట్టేసింది. భారత్‌లో 69 శాతం అవినీతి ఉందని పేర్కొంది. దేశంలో ఎక్కువగా స్కూళ్లు, ఆస్పత్రులు, ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే కార్యాలయాలు, పోలీసు శాఖలో అవినీతి జరుగుతోందని సర్వే పేర్కొంది.
అవినీతిని రూపుమాపాలని మోదీ ప్రభుత్వం చేస్తున్న లక్ష్యాలను అందుకోవాలంటే ఇంకా ఆ దేశం చాలా ముందుకు వెళ్లాల్సి ఉందని ఆ నివేదిక పేర్కొన్నది. ఆసియా దేశాల్లో లంచాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపింది. భారత్ తర్వాత వియత్నాం, థాయిల్యాండ్, పాకిస్థాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి. భారత్‌లో అవినీతి 69 శాతం ఉండగా, వియత్నాంలో 65 శాతం లంచాలు ఇస్తేనే పనులు జరుగుతాయట. పాకిస్థాన్‌లో అవినీతి 40 శాతం ఉన్నదట.