Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాక్ పై భారత్ మహిళా క్రికెటర్ల విజయభేరి

Posted 8 months ago | Category : sports

భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌పై సాధించిన వరుస విజయాల జోరుతో దాయాది పాకిస్థాన్ భరతం పట్టింది. స్వల్ప స్కోరుకే కట్టడి చేశామని సంబరుపడ్డ పాక్ ఆశలను వమ్ముచేస్తూ మిథాలీసేన మహిళల ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది.భారత్ 95 పరుగుల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది. 

టీమ్‌ఇండియా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యఛేదనలో ఏక్తాబిస్త్(5/18) స్పిన్ ధాటికి పాక్ 74 పరుగులకే కుప్పకూలింది. జట్టులో కెప్టెన్ సనామిర్(29), నహీదాఖాన్(23) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టిన ఏక్తాబిస్త్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లతో టాప్‌లో ఉన్నది. 

నిర్దేశించింది స్వల్ప లక్ష్యమైనా ప్రత్యర్థి పాక్‌ను భారత్ కట్టడిచేసింది పిచ్ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చిన కెప్టెన్ మిథాలీ ఇన్నింగ్స్ రెండోవర్లో స్పిన్ బౌలింగ్‌ను దింపింది. ఇక్కడే జట్టు విజయానికి బాటలు పడ్డాయి. లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ ఏక్తా బిస్త్ బౌలింగ్ విజృంభణతో పాక్ బ్యాట్స్‌వుమెన్స్ విలవిలలాడిపోయారు.  

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన పాక్ ఏ దశలోనూ పోరాటపటిమ ప్రదర్శన కనబర్చలేకపోయింది. 24 పరుగులకే టాపార్డర్ మొత్తం చాపచుట్టేసింది. ఇందులో మూడు వికెట్లు బిస్త్‌కే దక్కగా, అవన్నీ కూడా ఎల్బీడబ్ల్యూలే కావడం విశేషం. ఒక దశలో కనీసం 50 పరుగులైనా చేరుకుంటుందా అన్న దశలో కెప్టెన్ సనామిర్(29) ఆఖరి వరుస బ్యాట్స్‌వుమెన్ తో కలిసి ఇన్నింగ్స్‌ను పొడిగించింది. . 

గత మ్యాచ్‌లకు భిన్నంగా టీమ్‌ఇండియా బ్యాట్స్‌వుమెన్ పరుగులు కొల్లగొట్టడంలో ఒకింత వెనుకబడిపోయారు. దీనికి తోడు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ పాక్ బౌలర్లు నశ్రా సంధు (4/26), సదియా యూసుఫ్(2/30) విజృంభించడంతో మిథాలీసేన 169 పరుగులకు పరిమితమైంది. వన్డేల్లో భారత్‌ను ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడం పాక్‌కు ఇదే తొలిసారి.

దీప్తిశర్మ(28), పూనమ్ రౌత్(47)తో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ ఆఖరి 6 ఓవర్లలో సుశ్మ శర్మ(33) బ్యాటు ఝులిపించడంతో టీమ్‌ఇండియాకు ఈ మాత్రమైనా స్కోరు దక్కింది. లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ సంధు(4/26) తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకుంది. ఇక్బాల్(1/46), బేగ్(1/28) ఒక్కో వికెట్ దక్కింది.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 16 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 9 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 9 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!