//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చరిత్రాత్మక 1000వ టెస్టు....ఇంగ్లాండ్‌×భారత్‌....విజయం ఎవరిదో...!

Category : sports

చరిత్రాత్మక 1000వ టెస్టులో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచింది . ఆ జట్టు సారథి జోరూట్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సిరీస్‌ గెలిచి ప్రపంచ అత్యుత్తమ పర్యాటక జట్టుగా పేరు నిలబెట్టుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది. గత సిరీస్‌లో విఫలమైన విరాట్‌ ఈ సారి తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

ఆకాశంలో మబ్బులున్నాయి. బంతి స్వింగ్‌ అయ్యే అవకాశాలున్నాయి. టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారాను జట్టులోకి ఎంపిక చేయలేదు. అనూహ్యంగా శిఖర్‌ ధావన్‌కు చోటిచ్చారు. పేస్ బౌలింగ్లో కొంచెం వీక్ గా వున్నా షమీ ఫై నమ్మకం ఉంది అని విరాట్ అన్నాడు.

భారత జట్టు: మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి

ఇంగ్లాండ్‌: అలిస్టర్‌ కుక్‌, కీటన్‌ జెన్నింగ్‌స, జో రూట్‌, డేవిడ్‌ మలన్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, అదిల్‌ రషీద్‌, సామ్‌ కురన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌