//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర

Category : sports

భువనేశ్వర్‌లో ముగిసిన 22వ ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో 29 పతకాలతో అగ్రస్థానం ఆక్రమించింది. ఈ పోటీల్లో భారత్‌ అన్ని విభాగాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 

చాంపియన్‌షిప్ చరిత్రలో మొదటిసారి 12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ లేపింది. 1985 జకార్తలో సాధించిన 22 పతకాల ప్రదర్శన తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమం కావడం విశేషం. ఇక ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన చైనా 8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలతో రెండో స్థానానికి పరిమితమైంది. 

పోటీలకు ఆఖరి రోజైన ఆదివారం భారత అథ్లెట్లు ఆకాశమేహద్దుగా చెలరేగారు. ఐదు స్వర్ణాలు సహా ఓ రజతం, మూడు కాంస్య పతకాలు కొల్లగొట్టారు. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో స్వప్న బర్మన్ మొత్తం 5942 పాయింట్లతో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించింది. ఇదే పోటీలో మెగ్ హంపిల్(జపాన్), పూర్ణిమా హెంబ్రామ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 

పురుషుల జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోఫ్రా, పురుషుల 10వేల మీటర్ల పరుగులో గోవిందన్‌ లక్ష్మణన్‌, మహిళల హెప్‌టాథ్లాన్‌లో స్వప్న బర్మన్‌, మహిళల 4×400 రిలేల్లో భారత్‌ స్వర్ణాలను సాధించింది. భారత స్పింటర్‌ అర్చనా యాదవ్‌(పంజాబ్‌) హెప్టాథ్లాన్‌ స్వప్న బర్మన్‌లు రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు.దీంతో భారత్‌ స్వర్ణాల సంఖ్య 9కి చేరింది. అంతర్జాతీయంగా అర్చనాకు ఇది తొలి పతకం కావడంతో ఆనందం వ్యక్తం చేసింది.